ఒంగోలు: ప్రకాశం జిల్లా చెరువుకొమ్మ పాలెంలో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. 1) కరేటి అభిరామ్ (14) , కరేటి సుశాంత్ (12), పొదిలి చెన్ను (11) ఇల్లా దినేష్ (10)గా గుర్తించారు. చిన్నారుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన చిన్నారులు చెరుకు పాలెంగా గుర్తించారు.
చిన్నారులు నీటికుంటలో పడ్డారనే సమాచారంతో అప్రమత్తమైన స్థానికులు నీటికుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నలుగురు చిన్నారులు మృత దేహాల్ని వెలికి తీశారు. చిన్నారులు మృతిపై కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.