గుంటూరు, సాక్షి: మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం రేగింది. హస్టల్లోని వైద్య విద్యార్థులతో పాటు సిబ్బంది గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో 10 మంది విద్యార్థులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే డయేరియాకు గల కారణాలు ఏంటి.. ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు వల్ల సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ADVERTISEMENT
ADVERTISEMENT