సాక్షి, అమరావతి: కియా ఇండియా నాలుగేళ్లలోనే 10 లక్షల కార్లను ఉత్పత్తి చేయడంపై సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. స్వల్ప కాలంలోనే మిలియన్ కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా కియా ఇండియా చరిత్ర సృష్టించిందని.. ఇందుకు కియా ఇండియాకు హృదయపూర్వక అభినందనలంటూ ఆయన గురువారం ట్వీట్ చేశారు.
ఏపీ ఆటోమొబైల్ రంగం పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానమని ఈ మైలురాయి చాటి చెప్పిందని పేర్కొన్నారు. అలాగే పుష్కల వనరులున్న రాష్ట్రమని మరోసారి అందరికీ తెలియజేసిందన్నారు. భవిష్యత్లో కియా ఇండియా మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
చదవండి: వలంటీర్ల వ్యవస్థ రద్దు కోసమే కుట్ర
Hearty congratulations to the @KiaInd team for creating history by producing their millionth car in a short span of 4 years!
This milestone makes Andhra Pradesh a favoured destination for the automobile industry and reiterates that Andhra Pradesh truly is Where Abundance meets…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2023