సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి చేరుకుంటారు. అక్కడ సీ కే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేత పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.
అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయలుదేరుతారు. పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వరుసగా ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ADVERTISEMENT
ADVERTISEMENT