సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్కు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
ADVERTISEMENT
ADVERTISEMENT