డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
డీకే శివకుమార్ బుధవారం కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లోక్‌భవన్‌లో సాయంత్రం 4.05 గంటలకు నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. డీకే శివకుమార్‌తోపాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత గత నెల 30న డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
సిద్ధరామయ్యను కలిసిన డీకే
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ బుధవారం బెంగళూరులో ఉదయం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, పార్టీ నాయకుడు జి. పరమేశ్వరను కలిశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని స్వయంగా శివకుమార్ ఆహ్వానించారు.
#WATCH | Bengaluru | Karnataka CM-designate DK Shivakumar meets former CM Siddaramaiah at his residence ahead of swearing-in ceremony
(Source: DK Shivkumar's office) pic.twitter.com/hQj7fWsdaO— ANI (@ANI) June 3, 2026
డీకేకు వీహెచ్ అభినందనలు
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభినందనలు తెలిపారు. కర్ణాటకలో సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని సిద్దరామయ్య గౌరవించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని హనుమంతరావు వ్యక్తం చేశారు.
యడియూరప్ప ఇంటికి డీకే
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ బుధవారం బెంగళూరులో ఉదయం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్పను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "యడియూరప్ప రాష్ట్రానికి మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రం కోసం కృషి చేశారు. మనమందరం కలిసి పనిచేయాలనిష ఆయనను కోరినట్టు చెప్పారు. అంతకుముందు తమ పార్టీకి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి జి. పరమేశ్వరను డీకే కలిశారు.
#WATCH | Bengaluru | Karnataka CM designate DK Shivakumar arrives at the residence of BJP leader & former CM BS Yediyurappa, ahead of swearing in ceremony of Karnataka Cabinet pic.twitter.com/YIhKuOtoWA
— ANI (@ANI) June 3, 2026
ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ
ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి పాలి త రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలను కూడా ఆహ్వానించారు.
Fair call https://t.co/SQDLhn3WWF
— Tweet (@tweet) November 28, 2021
మరిన్ని వార్తలు